Adilabad: పార్కు కబ్జాపై హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ!

అదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో మా పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చిన్నారులు రాసిన లేఖపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, పురపాలక సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. మార్చి 7న తదుపరి విచారణ జరగనుంది.

Adilabad: పార్కు కబ్జాపై హైకోర్టు సీరియస్‌.. కీలక ఆదేశాలు జారీ!
New Update

Children park: అదిలాబాద్ పట్టణంలో చిన్నారులు ఆడుకునే పార్క్ కబ్జా చేయాలని కొందరు ప్రయత్నించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇష్యూపై వెంటనే వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, పురపాలక సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు జస్టిస్‌కు లేఖ..

పూర్తి వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 1.5ఎకరాల పార్క్ స్థలం ఉంది. పార్కు స్థలంలో కొంత భూమిని కబ్జాచేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 23 మంది చిన్నారులు హైకోర్టు జస్టిస్‌కు లేఖ రాశారు. చిన్నారులు రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది.

ఇది కూడా చదవండి : Vishal: పబ్లిసిటీ కోసం దిగజారిపోవద్దు.. త్రిష కామెంట్స్ పై విశాల్!

పురపాలక సంఘానికి ఆదేశాలు..

దీంతో కబ్జాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు తెలపాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, అదిలాబాద్ కలెక్టర్ కు, పురపాలక సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి మున్సిపల్ కమిషనర్ శైలజ పాత్రపై విచారణ జరపాలని, అప్పటి కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చాలని న్యాయస్థానం సూచించింది. కబ్జా స్థలంలో ప్రస్తుతం అయ్యప్ప ఆలయం, ఇతర నిర్మాణాలు ఉన్నాయి.

#childrens-park-case #telangana-high-court #adilabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe