George Bailey : 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ (Cricket World Cup), ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కప్ (World Test Championship Cup) రెండింటిలోనూ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. టీ20 ప్రపంచకప్ గెలిచి రికార్డు సృష్టించాలని కోరుకుంది. కానీ భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడంతో కంగారుల జట్టు సెమీ ఫైనల్ రౌండ్ కు కూడా అర్హత సాధించకుండానే నిష్క్రమించింది.
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ (David Warner), సిరీస్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, మినీ వరల్డ్ కప్ గా పిలిచే ఛాంపియన్స్ కప్ క్రికెట్ సిరీస్ మరో ఆరు నెలల్లో పాకిస్థాన్ లో జరగనుంది.ఈ టోర్నీకి సన్నద్ధం కావడానికి అన్ని జట్లు ఇప్పుడిప్పుడే తమ జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు డేవిడ్ వార్నర్ తెలిపాడు.
దీనిపై వ్యాఖ్యానించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ హెడ్ జార్జ్ బెయిలీ.. ఇకపై వార్నర్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకోబోమని ప్రకటించారు. ఆస్ట్రేలియా జట్టుకు అంతర్జాతీయంగా అతను పదవీ విరమణ చేశాడు. కాబట్టి అతనిని తీసుకునే ప్రశక్తి లేదని జార్జ్ తెలిపాడు. డేవిడ్ వార్నర్ ఛాంపియన్ ట్రోఫీలో ఖచ్చితంగా ఆస్ట్రేలియా జట్టు కోసం ప్రణాళికలో లేడని చెప్పాడు.అదేవిధంగా మాథ్యూ వేడ్‌తో సహా ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం లేదని చెప్పలేమని జార్జ్ బెయిలీ తెలిపాడు. డేవిడ్ వార్నర్ ప్లేస్ లో (ఐపీఎల్ ఢిల్లీ ప్లేయర్) జాక్ ఫ్రేజర్ మైదానంలోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : కేసీఆర్‌కు షాక్.. కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు