Electric Scooter: ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాలకే డిమాండ్ ఉంది. పెట్రల్, డీజిల్ ధరలు ఎక్కువవ్వడంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిచేందుకు చాలా మంది ఈ వాహనాలవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈవీలను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలోనే మార్కెట్లోకి ఎన్నో కొత్త కొత్త కంపెనీలు ఈవీలను పరిచయం చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఓలా మనదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఎక్కువగా విక్రయిస్తున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఓలా కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ధర పై రూ. 25వేలు తగ్గిస్తున్నట్లు ఎక్స్ లో వెల్లడించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ను ఇస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధర రూ.1,09,999 ఉండగా.. 84,999కే లభిస్తుంది. ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ.1,19,999 గా ఉంటే.. ఇక నుంచి 1,04,999కే లభిస్తుంది. ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,47,999గా ఉండగా.. ఇప్పుడు ఆఫర్ కింద రూ.1,29,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమేనన్న విషయం గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి నెల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులోఉంటుంది. ఈనెలలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇవే ధరలు ఉండకపోవచ్చు. అందువల్ల ఈవీ కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయమని కంపెనీ సూచిస్తోంది.
ఓలా ధరల తగ్గింపు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి రూ. 25వేల తగ్గింపుతో ఈ స్కూటర్స్ ను కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 29 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఓలా కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఆసుపత్రిలో చేరిన ప్రియాంకగాంధీ..!!