Salman khan: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ!

గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రతీకారం తీర్చుకునేందుకే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ల మనుషులు సల్మాన్ ఇంటిముందు కాల్పులకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. సల్మాన్ హత్యకు తీహార్ జైలు నుంచి సుపారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

New Update
Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్

Gunshots Outside Salman Khan Home: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో తూటాల వర్షం కురిపించడంతో ముంబై నగరం ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ కు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతోపాటు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ తో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ల మధ్య వివాదం మరోసారి తెరమీదకొచ్చింది.

కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీశారనే..
ఈ మేరకు గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ముద్దాయిగా ఉన్న నటుడు వాటిని చంపి తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీశారనే నెపంతో డెత్ వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా ఇచ్చిన సమాచారం మేరకు.. కృష్ణ జింకలను లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీ అత్యంత పవిత్రంగా పూజిస్తారు. వాటిని చంపిన కేసులో సల్మాన్ (Salman Khan) ముద్దాయి కావడంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. కొందరికి సుపారీ ఇచ్చి సల్మాన్ ఖాన్‌ను చంపించాలని ప్లాన్ చేశాడని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Vindhya: స్టేజ్‌పై బట్టలు మార్చుకోవడం నా వల్ల కాలేదు.. అయినా తప్పలేదు!

అత్యంత కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్..
ఇక గోల్డీ బ్రార్ కెనడాకె చెందిన గ్యాంగ్‌స్టర్. కెనడా ప్రభుత్వం ప్రకటించిన అత్యంత కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్లలో బ్రార్ ఒకరు. కాగా పంజాబ్‌లో గులాబేవాలాలోని ముఖ్త్‌సర్ గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ అనుచరుడు. పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇక పంజాబ్‌ ఫిరోజ్‌పూర్‌కు చెందిన లారెన్స్ బిష్నోయ్ కి పంజాబ్ యూనివర్సిటీలో గోల్డీ బ్రార్‌తో స్నేహం ఏర్పడింది. న్యాయశాస్త్రంలో పట్టబద్రుడైన ఫిరోజ్.. హత్యలు, హవాలా, బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ నేరస్థుడిగా ముద్ర వేసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 700 షూటర్లు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు