Patanjali Products Ban: బాబా రామ్‌దేవ్ పతంజలికి మరో పెద్ద షాక్.. వాటి లైసెన్స్ లు క్యాన్సిల్! సుప్రీంకోర్టు దెబ్బతో బాబా రామ్‌దేవ్ పతంజలి పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పటికే తన తప్పుడు ప్రకటనలపై బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. పతంజలి-దివ్య ఫార్మసీకి చెందిన దాదాపు 14 ప్రోడక్ట్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. By KVD Varma 30 Apr 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద -దివ్య ఫార్మసీకి చెందిన దాదాపు 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌లను(Patanjali Products Ban) ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సోమవారం సాయంత్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ లైసెన్సింగ్ అథారిటీ కూడా సోమవారం ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల గురించి తప్పుదారి పట్టించే ప్రకటనలను పదేపదే ప్రచురించడం వల్ల కంపెనీ లైసెన్స్(Patanjali Products Ban) నిలిపివేస్తూ చర్యలు తీసుకున్నారు. Also Read: ఈరోజు స్టాక్ మార్కెట్ పై నిపుణుల అభిప్రాయం ఇదే! దివ్య ఫార్మసీ పతంజలి ఉత్పత్తులను(Patanjali Products Ban) తయారుచేస్తుంది. దగ్గు, రక్తపోటు, చక్కెర, కాలేయం, గాయిటర్, కంటి చుక్కల కోసం ఉపయోగించే 14 మందుల ఉత్పత్తిని నిలిపివేయాలని రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ రామ్ దేవ్ బాబా సంస్థను ఆదేశించింది. అన్ని జిల్లాల డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు కూడా ఈ ఉత్తర్వులు పంపారు. జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రామ్‌దేవ్, బాలకృష్ణ, దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద సంస్థలపై(Patanjali Products Ban) ఏప్రిల్ 16న కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు కూడా ఇచ్చారు. వాస్తవానికి, కోర్టు ఆయుష్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ నుండి సమాధానాలు కోరింది. పతంజలి కేసును సుప్రీంకోర్టు విచారించనుంది ఇప్పుడు రామ్‌దేవ్‌పై ధిక్కార అభియోగాలు నమోదు చేయాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు (ఏప్రిల్ 30) పతంజలి కేసును విచారించనుంది. పతంజలి ఆయుర్వేద సోమవారం (ఏప్రిల్ 22) కొన్ని వార్తాపత్రికలలో క్షమాపణలు ప్రచురించింది. పతంజలి ఆయుర్వేదం సుప్రీంకోర్టును పూర్తిగా గౌరవిస్తుందని పేర్కొంది. మా న్యాయవాదులు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఆ తర్వాత మేము ప్రకటన ప్రచురించాము. విలేకరుల సమావేశం నిర్వహించాము. దీనికి మేము క్షమాపణలు కోరుతున్నాము. భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం చేయము అంటూ పతంజలి పేర్కొంది. #patanjali-products #patanjali-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి