Polavaram Project: ఏపీలో వర్షం దంచికొడుతోంది. మూడురోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నమోదు అయింది. స్పిల్ వే ద్వారా 7 లక్షల 96 వేల 686 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు అధికారులు.
రోజురోజుకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. వరద 43 అడుగులకు చేరుకుంటే మొదటి హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే పాపికొండలు విహారయాత్ర నిలిపివేశారు అధికారులు. గండి పోచమ్మ ఆలయం నీట మునిగింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.