ఫిట్‌నెస్ సెంటర్ కోచ్ వక్ర బుద్ధి.. యువతి స్నానం చేస్తుండగా ఏం చేశాడంటే? ఫిట్‌నెస్ సెంటర్‌కు వచ్చిన ఓ యువతిపై కోచ్ వక్ర బుద్ధి చూపించాడు. శిక్షణ ముగిశాక అదే సెంటర్ లో ఆమె స్నానం చేస్తుండగా దొంగచాటున వీడియో చిత్రీకరించాడు. మహిళలను భయాందోళనకు గురిచేసే ఈ ఘటన బెంగులూర్ లోని బాణసవాడి ప్రాంతంలో జరిగింది. By srinivas 10 Nov 2023 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఫిట్‌నెస్ సెంటర్‌కు వచ్చిన ఓ యువతిపై కోచ్ వక్ర బుద్ధి చూపించాడు. శిక్షణ ముగిశాక అదే సెంటర్ లో ఆమె స్నానం చేస్తుండగా దొంగచాటున వీడియో చిత్రీకరించాడు. మహిళలను భయాందోళనకు గురిచేసే ఈ ఘటన బెంగులూర్ లోని బాణసవాడి ప్రాంతంలో జరిగింది. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణసవాడి ప్రాంతం ఎన్‌ఆర్‌ఐ లే అవుట్ వద్ద సదరు వ్యక్తి కొంతకాలంగా ఫిట్‌నెస్ సెంటర్ నడిపిస్తున్నాడు. అయితే రెండునెలల కిందట స్విమ్మింగ్‌తో పాటు ఫిట్‌నెస్ కోసం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇందులో చేరారు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ లాగే తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. అయితే ఆదివారం ఉదయం యథావిధిగా శిక్షణకు వచ్చిన యువతి.. వర్కౌట్స్ కంప్లీట్ అయ్యాక సెంటర్‌లోనే స్నానం చేసేందుకు బాత్ రూమ్ వెళ్లింది. ఇదే సమయంలో స్నానం చేస్తున్న యువతిని సదరు కోచ్ దొంగచాటుగా మొబైల్ ద్వారా వీడియో తీస్తున్నట్లు మరో యువతి గమనించి వెంటనే కోచింగ్ సెంటర్ మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో వెంటనే సెంటర్‌కు అనుబంధంగా ఉండే సీసీ కెమెరాలను పరిశీలించగా ఫిట్‌నెస్ కోచ్ హెచ్‌ఎస్ సిబియాచన్ వీడియో తీసినట్లు గుర్తించామని మేనేజర్ తెలిపారు. Also read :పాకిస్తాన్‌కు పాస్‌పోర్ట్ కష్టాలు.. లక్షలాది మందికి తప్పని తిప్పలు అయితే ఈ సంఘటనతో ఫిట్ నెస్ సెంటర్ కు వచ్చే మహిళలంతా ఉలిక్కిపడ్డారు. ఆ యువతి సైతం భయంతో బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కోచ్‌ను అరెస్టు చేశారు. మొబైల్‌లో చిత్రీకరించిన వీడియోలను, ఫొటోలను మొబైల్ నుంచి డిలీట్ చేశారు. కాగా గతంలోను ఇదే తరహాలో ఎవరివైనా వీడియోలు తీశారా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారగా ఫిట్ నెస్ సెంటర్ లపై ప్రత్యేకంగా కన్నేసి ఉంచాలని పలువురు పోలీసులను కోరుతున్నారు. #young-woman-bath #shoot-the-video #fitness-center-coach మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి