BRS First List: బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ..80 మందికి పైగా జాబితాలో చోటు!!

అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల లిస్ట్ ప్రకటన చేయడానికి గులాబీ బాస్ సిద్ధమైనట్టు సమాచారం. దీంతో ఈనెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని తొలి జాబితాను విడుదల చేయడానికి  ముహూర్తంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 లో కూడా  శ్రావణమాసంలోనే అభ్యర్థుల జాబితా కేసీఆర్ విడుదల చేశారు.

New Update
BRS First List: బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ..80 మందికి పైగా జాబితాలో చోటు!!

కాగా, ఇప్పటికే  80 నుంచి 87 మంది అభ్యర్థులతో లిస్ట్ తయారైనట్టు సమాచారం. ఇక పిత్రపక్షం రాకముందే శ్రావణంలోనే అభ్యర్థుల లిస్ట్ విడుదల చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) భావిస్తున్నారు. ఎందుకంటే పిత్రపక్షం  మంచి పనులకు అనుకూలం కాదని బలంగా నమ్ముతారు. అందుకే వినాయక చవితి కంటే ముందే మొదటి లిస్టును విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

మరో వైపు ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి లిస్టులో మా పేరు ఉంటుందా.. ఉండదా అంటూ పార్టీ నాయకుల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. కేసీఆర్, కేటీఆర్ (KTR) ను ప్రసన్నం చేసుకునే దిశగా బీఆర్ఎస్ (BRS)నాయకులు తమ తమ స్థాయిలో పావులు కదుపుతున్నాయి. ఇక ఇలా ఉంటే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలల్లో టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఈ సారి అధినాయకుడు కొత్త వారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎసరు పడుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇక ఇలా ఉంటే చాలా రోజుల నుంచి అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ గెలుపుగుర్రాలనే బరిలోకి దింపాలని డిసైడ్ అయింది. దీంతో కొత్త, పాత అన్న తేడా లేకుండా ఆ నియోజకవర్గంలో సత్తా ఉన్న వారికే టికెట్ ఇవ్వనుంది. కాగా, ఫస్ట్ లిస్ట్ లో మాత్రం బీఆర్ఎస్ వివాదం లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతుంది.

Also Read: విశాఖలో పవన్ కళ్యాణ్ ‘జనవాణి’ కార్యక్రమం.. వాటిపై చర్చ!!

Advertisment
తాజా కథనాలు