అయోధ్య ( Ayodhya)లో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయా (Maharshi Valmiki International Airport)న్ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం (జనవరి 30) ప్రారంభించిన వెంటనే, మొదటి విమానం ఢిల్లీ నుండి అయోధ్య నగరానికి బయలుదేరింది. ఈ సందర్భంగా ఇండిగో విమాన పైలట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్ 'జై శ్రీరామ్' అంటూ ప్రయాణికులకు స్వాగతం పలికారు. వార్తా సంస్థ ANI తన వీడియోను పంచుకుంది. అందులో పైలట్ ప్రయాణికులను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రకటించడం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. దీంతో ఫ్లైట్ లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
పైలట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్ (Captain Ashutosh Shekhar) ప్రయాణీకులతో మాట్లాడుతూ, "ఈ రోజు మా సంస్థ ఇండిగో(Indigo) ఈ ముఖ్యమైన విమానానికి కమాండ్ ఇవ్వడానికి తగిన వ్యక్తిగా నన్ను పరిగణించడం నాకు గొప్ప అదృష్టం. ఇది మా సంస్థకు చాలా సంతోషకరమైన విషయం. "ఈ విమానం యొక్క సిబ్బంది అయిన మా కోసం, మాకు. మాతో మీ ప్రయాణం ఆహ్లాదకరంగా, శుభప్రదంగా ఉంటుందని ఆశిస్తున్నాం... జై శ్రీరామ్.’’ దీనిపై ప్రయాణికులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
కాగా అయోధ్య ధామ్ (Ayodhya Dham)కు ప్రయాణంలో విమానంలో ప్రజలు 'హనుమాన్ చాలీసా' పఠించారు. అదే సమయంలో, విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై కదులుతున్న వెంటనే, ప్రయాణీకుల నుండి జై శ్రీరామ్ నినాదాలు (Slogans of Sri Ram) చేశారు. ఇండిగో విమానం సిబ్బందితోపాటు ప్రయాణికులు కూడా ఫుల్ ఖుషీగా సంబురాలు జరుపుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి కేక్ కట్ చేసి ఈ చారిత్రక ప్రయాణానికి రెడీ అయ్యారు. అనంతరం కాషాయ కండువాలు ధరించిన ప్రయాణికులు జై శ్రీరామ్ అంటు విమానంలో నినాదాలు చేశారు. అయోధ్యకు వెళ్తున్న తొలి విమానంలో ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అయోధ్యకు విమానా సౌకర్యాన్ని కల్పించిన విమానాయశాఖతోపాటు ప్రధాని మోదీకి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య నిర్మాణమే చారిత్రాత్మక ఘట్టం..అలాంటి పుణ్యభూమికి తాము ఫ్లైట్ లో వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయాణం ఎంతో ఉద్వేగభరితంగా సాగిందని..ప్రతిఒక్కరం ఎంతో గానో ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ఈరోజు తమ జీవితంలో గుర్తుండిపోతుందని అయోధ్యకు వెళ్లే ముందు ప్రయాణికులు తెలిపారు.