Trump: అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతనే!

ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని FBI గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్‌ పార్క్‌ చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా అధికారులు గుర్తించారు. థామస్ మాథ్యూ క్రూక్స్‌ కుటుంబ నేపథ్యం, ట్రంప్‌పై కాల్పులు ఎందుకు జరిపాడనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Trump: అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతనే!
New Update

Trump: ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని FBI గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్‌ పార్క్‌ చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా అధికారులు గుర్తించారు. ఏఆర్‌ 15 ఆటోమెటిక్‌ గన్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. థామస్ మాథ్యూ క్రూక్స్‌ కుటుంబ నేపథ్యం, ట్రంప్‌పై కాల్పులు ఎందుకు జరిపాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్రూక్స్‌ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని FBI అధికారులు తెలిపారు. డీఎన్‌ఏ, బయోమెట్రిక్‌ ద్వారా నిందితుడి ఆధారాల నిర్ధారణకు ప్రయత్నిస్తున్నారు. కాగా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్ల ఎదురుకాల్పుల్లో క్రూక్స్‌ మృతి చెందాడు.

ట్రంప్‌పై షూటర్ ఎక్కడ కాల్పులు జరిపాడు?

100 మీటర్ల దూరం నుంచి ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి దాదాపు 300 అడుగుల దూరంలో షూటర్ ఉన్నాడని, అక్కడి నుంచి ట్రంప్‌ను టార్గెట్ చేసుకున్నాడని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. ఏఆర్ స్టైల్ (ఏఆర్-15) రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అయితే, ఈ షూటర్ స్నిపర్ చేతిలో హతమయ్యాడు. ఘటన అనంతరం అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

publive-image 100 మీటర్ల దూరం నుంచి

#trump
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe