Uttar Pradesh : కూతురు విడాకుల(Divorce) తంతును ఓ తండ్రి వినూత్నంగా నిర్వహించారు. అత్తగారింట్లో భర్తతోపాటు అందరి పోరు పడలేక డివోర్స్ తీసుకున్న యువతి పుట్టింటికి వస్తున్న క్రమంలో బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా తీసుకెళ్లాడు. ఈ ఆసక్తికరమైన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) లో చోటు చేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కొంతకాలానికే వేధింపులు..
ఈ మేరకు కాన్పూర్‌కు చెందిన అనిల్ కుమార్ అనే ఓ బీఎస్ఎన్ఎల్(BSNL) ఉద్యోగి.. విడాకులు తీసుకున్న తన 36 ఏళ్ల కూతురు ఉర్విని సంతోషంగా పుట్టింటికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో ఉర్వి ఇంజనీర్‌గా పనిచేస్తుండగా.. 2016లో పెళ్లి చేసుకుని మెట్టింటికి వెళ్లింది. అయితే కొంతకాలానికే అక్కడ వేధింపులు మొదలయ్యాయని, అదనపు కట్నం కోసం తన బిడ్డను తీవ్రంగా హింసించారని అనిల్ కుమార్ వాపోయారు.
ఇది కూడా చదవండి: TS News: థియేటర్ లోకి మైనర్‌లకు నో ఎంట్రీ.. యాజమాన్యానికి పోలీసుల ఆదేశాలు!
ఎన్నో కష్టాలు అనుభవించింది..
‘నా బిడ్డను 8 ఏళ్ల నుంచి కొడుతున్నారు. వేధిస్తున్నారు. అవమానిస్తున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించింది. విరక్తి వచ్చి భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. వైవాహిక బంధాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఆ బంధం తెగిపోయింది. ఫిబ్రవరి 28న కోర్టు ఉర్వి దంపతులకు విడాకులు మంజూరు చేసింది. విడాకుల నోటీసుల్లో తన కష్టాలను ఉర్వి వివరించింది. ఉర్వికి ఒక కుమార్తె కూడా ఉండగా.. ఆమెను కూడా తనతోపాటు పుట్టింటికి తరలించారు. కుమార్తె, మనవరాలి రాక కోసం తాము ఎదురుచూస్తున్నట్లు ఉర్వి తల్లి కుసుమలత సంతోషం వ్యక్తం చేశారు.