Republic Day 2024: ఆగస్టు 15 - జనవరి 26 జెండా ఎగురవేయడంలో ఈ తేడా గమనించారా?

ఆగస్టు 15, జనవరి 26 రెండు రోజులు జెండా ఎగురవేస్తారనే సంగతి తెలిసిందే. కానీ, జెండా ఎగురవేసే విధానంలో మాత్రం తేడా ఉంటుంది. ఆగస్టు 15న జెండా పైకి జరిపి, తరువాత ఎగురవేస్తారు. జనవరి 26న అప్పటికే పైకి కట్టి ఉన్న జెండాను ఎగురవేస్తారు. 

New Update
Republic Day 2024: ఆగస్టు 15 - జనవరి 26 జెండా ఎగురవేయడంలో ఈ తేడా గమనించారా?

Republic Day 2024: భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశం మొత్తం ఎంతో వైభవంగా.. దేశభక్తితో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) మొదటిసారిగా జనవరి 26, 1950న నిర్వహించుకున్నాము. మన దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. మన దేశ రాజ్యాంగం (Indian Constitution) 26 జనవరి 1950న ఉనికిలోకి వచ్చి భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day), జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత మహిళలు శంఖ నాదస్వరం డోలు వాయిస్తూ పరేడ్ చేయనున్నారు.

జెండా ఎగురవేయడానికి విధానాలు ఉన్నాయి..
జాతీయ జెండాను ఆగస్టు 15 అలాగే జనవరి 26 రెండు రోజులూ ఎగురవేస్తారు.  అయితే రెండు సందర్భాలలో జెండాను ఎగురవేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జెండాను ముందుగా కింది నుంచి తాడు లాగి పైకి లేపి, ఆ తర్వాత విప్పి ఎగురవేస్తారు. దీనినే ధ్వజారోహణం అంటారు. ఇదిలా ఎందుకు చేస్తారు అంటే.. మనకి స్వాతంత్య్రం వచ్చినపుడు బ్రిటిష్ జెండా కిందకు దించుతుంటే.. మన జెండా పైకి కదుపుతూ ఎగరవేశారు. అందుకే ఇప్పటికీ అదేవిధానంలో జెండాను కింది నుంచి తాడుతో పైకి లాగిన తరువాత ఎగురవేస్తారు. 

కానీ, జనవరి 26న అలాకాదు.. రిపబ్లిక్ డే సందర్భంగా ఎగురవేసే జెండా ముందుగానే పైన కట్టి ఉంటుంది. దానిని తాడు లాగి ఆవిష్కరిస్తారు అంతే. అలాగే రిపబ్లిక్ డే రోజు రాజ్ పథ్ లో ఎగురవేస్తారు. అదే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై జెండా ఎగురవేస్తారు.

Also Read: బంగారం కొనేవారికి మంచి అవకాశం.. నిలకడగా ధరలు 

ప్రధానమంత్రి దేశానికి రాజకీయ అధిపతి కాబట్టి స్వాతంత్ర  దినోత్సవం రోజున జెండా ఎగురవేస్తారు.  అయితే రాష్ట్రపతి రాజ్యాంగ అధిపతి కాబట్టి గణతంత్ర దినోత్సవం రోజున  జెండాను రాష్ట్రపతి ఎగురవేస్తారు. దేశ రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమలులోకి వచ్చింది, అందుకే దేశ రాజ్యాంగ అధిపతి జెండాను ఎగురవేస్తారు.

ఇతర దేశాల రాజకీయ నాయకులను రిపబ్లిక్ డే సందర్భంగా ఆహ్వానిస్తారు.  అయితే ఇది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరగదు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా భారత్‌కు రానున్నారు.

రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు బీటింగ్ రిట్రీట్ వేడుక తర్వాత జనవరి 29న ముగుస్తాయి.  అయితే స్వాతంత్ర  దినోత్సవం ఆగస్టు 15న ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజున, దేశం సైనిక బలం,  సాంస్కృతిక గొప్పతనాన్ని తెలియచేస్తూ పెరేడ్ ఉంటుంది. కానీ.. స్వతంత్ర దినోత్సవం నాడు అలాంటి వేడుకలు ఉండవు. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు