Varanasi: అప్పుల బాధతో కాశీలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేక ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొండా వప్రియ (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్(23)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాశీ లోని ఆంధ్ర ఆశ్రమంలో తమ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వారణాసి పోలీసులు చెప్పారు. By KVD Varma 08 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Varanasi: వారణాసిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మశాలలోని ఓ గదిలో నలుగురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. కైలాష్ భవన్ దేవనాథ్ పూర్ ధర్మశాలలోని మూడో అంతస్తులో ఈ కుటుంబం నాలుగు రోజులుగా ఉంటోంది. నైలాన్ తాడు సహాయంతో నలుగురి మృతదేహాలు గదిలో వేలాడుతూ కనిపించాయి. మృతులను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండా వప్రియ (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌లతో (23) గుర్తించారు. డిసెంబర్ 3న వచ్చారు.. వారణాసిలోని(Varanasi) ఆంధ్రా ఆశ్రమం అధిపతి వీవీ సుందర్ మాట్లాడుతూ డిసెంబర్ 3న నలుగురు వచ్చారని చెప్పారు. డిసెంబర్ 6న వారిని తాము చూశామన్నారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం వారెవరూ బయటకు రాకపోవడంతో ధర్మశాల మహిళా ఉద్యోగి తలుపు తట్టింది. శబ్దం రాకపోవడంతో కిటికీలోంచి చూడగా ఉరికంబంపై వేలాడుతూ నలుగురూ కనిపించారు. గదిలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరణానికి కారణం అప్పులు అని పేర్కొన్నారు. Also Read: దేశంలో ఎల్ఫీజీ కనెక్షన్లు డబుల్ అయ్యాయి.. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ పోలీసులు తలుపులు పగులగొట్టి గదిలోకి ప్రవేశించారని సీపీ ముత్తా అశోక్ జైన్ తెలిపారు. నలుగురు కలిసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చెప్పారు. గదిలో సూసైడ్ నోట్ దొరికిందనీ, వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. బయటపడలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు దానిలో పేర్కొన్నారనీ రాసివున్నట్టు వెల్లడించారు. అప్పు తీర్చమని తమను పదే, పదే ఒక వ్యక్తి తీవ్రంగా ఒత్తిడి చేస్తుండడంతో తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ నోట్ లో ఉన్నట్టు సీపీ చెప్పారు. వీరు దాదాపు రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో లేరనీ.. అక్కడ చిన్న వ్యాపారం చేసుకునే వీరు అప్పుల పాలవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సీపీ చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. Watch this interesting Video: #andhra-pradesh #varanasi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి