ఇది దోశా లేక బంగారమా? ఎక్స్ లో చర్చకు దారి తీసిన దోశ ధర

ఎంత ఢిల్లీ అయితే మాత్రం దోశ ధర అంతేంటి బాసూ అంటున్నారు. ఇది తినే దోశ లేక దాచుకోవాలా అని కూడా చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో ఒక యువకుడి దోశ ఆర్డర్ చేస్తే వెయ్యి రూపాయల బిల్లు వేశారు.

ఇది దోశా లేక బంగారమా? ఎక్స్ లో చర్చకు దారి తీసిన దోశ ధర
New Update

ఢిల్లీలోని గురుగ్రామ్ లో ఓ హోటల్ లో ఇచ్చిన దోశ ఎక్స్ దుమ్ము లేపుతోంది. ఇప్పుడు అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. గురుగ్రామ్ లోని 32 ఎవెన్యూలో కర్ణాటక కేఫ్ లో ఆశిష్ షింగ్ అనే యువకుడు దోశ, ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. అరగంట తర్వాత వచ్చిన ఆ రెండిటినీ తినేవాడు కూడా. కానీ తర్వాతే పాపం కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎందుకంటే బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆ కుర్రాడికి ఏం చేయాలో తెలియ లేదు. బిల్లు అయితే కట్టి వచ్చేశాడు కానీ తన బాధ నంతా ఎక్స్ లో వెళ్ళగక్కుకున్నాడు.

ఎక్స్ లో ఆశిష్ పెట్టిన దోశ పోస్ట్ కు విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. దోశ అంత ధర ఏంటి బాసూ అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. అదే దోశ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో అయితే వెయ్యిలో పదవ వంతుకే వస్తుంది అని చెబుతున్నారు. తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్‌ అని ఒకాయన కామెంట్‌ చేశాడు. వీధి టిఫిన్‌ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి అని మరో కర్ణాటక అతను కామెంట్‌ పెట్టాడు.

అయితే వాళ్ళు చెప్పేది ఎక్కడపడితే అక్కడ దోశలు దొరికే రాష్ట్రాల్లో. కానీ డిల్లీలో వాటి రేటంతే బాసూ అంటున్నారు. ఇక్కడ దోశలు దొరకడమే అరుదు...దొరికతే అలానే ఉంటుంది అని చెబుతున్నారు. ఆశిష్ మాత్రం ఇంకెప్పుడూ దోశ తినడో ఏంటో. దయచేసి నాకు చవగ్గా దోవ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నాడు.

#price #ex #discussion #dosa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe