సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ మెట్రో..ఒక్కరోజే ఎంత మంది జర్నీ చేశారంటే!

మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలో ఆదివారం ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో ప్రయాణించారు.

Metro: ఉగాది స్పెషల్.. ప్రయాణికులకు మెట్రో బంపర్ ఆఫర్!
New Update

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలో మెట్రో వేసిన తరువాత ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలో ఆదివారం ఒక్కరోజే 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో ప్రయాణించారు. నగరంలో మెట్రో పరుగులు మొదలై ఆరేళ్లు అయ్యింది.

కరోనా తరువాత మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతుండడంతో కొన్ని రూట్లలో మెట్రో అధికారులు రైళ్లను నడుపుతున్నారు. పండుగల సీజన్‌ లలో అయితే ప్రయాణికులు జర్నీ మరింత ఎక్కువగా ఉంటుంది. నగరంలో ఐటీ కార్యకలాపాలు సందడిగా ఉండడంతో వ్యాపార , వాణిజ్య కార్యకలాపాలు కూడా మంచి జోరుగా సాగుతున్నాయి.

సాఫ్ట్వేర్‌ ఉద్యోగులతో మెట్రో సోమవారం నుంచి శుక్రవారం వరకు చాలా రద్దీ గా ఉంటుంది. కార్యాలయాలకు వెళ్లేందుకు ఆలస్యం కాకుండా ఉండేందుకు చాలా మంది ఐటీ ఉద్యోగులు మెట్రోనే ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌ నగరం రోజురోజుకి అభివృద్ధి చెందుంతుడడంతో చాలా అంతర్జాతీయ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

హైదరాబాద్‌ నగరంలో మెట్రో 2017 లో పరుగులు మొదలు పెట్టింది. మొట్టమొదటగా మియాపూర్‌ స్టేషన్‌ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నగరంలో మెట్రో ప్రాజెక్ట్‌ దశల వారీగా అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మూడు లైన్లు పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలతో కూడి మొత్తం 27 స్టేషన్లు ఉన్నాయి.

Also read: దీపావళి గిఫ్ట్స్‌ గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు..ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన యజమాని!

#record #metro #hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe