EPF Claim: ఈపీఎఫ్ గుడ్ న్యూస్.. క్లెయిమ్‌ కోసం చెక్ అవసరం లేదు!

ఈపీఎఫ్ నుంచి అడ్వాన్స్ లేదా ఇతర క్లెయిమ్స్ చేసుకోవడానికి ఇకపై చెక్ లేదా బ్యాంక్ పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే, ఈపీఎఫ్ చందాదారులు తమ బ్యాంక్ ఎకౌంట్ కేవైసీ అప్ డేట్ చేసుకుంటేనే వారికి చెక్ లేదా పాస్ బుక్ తో పనిలేకుండా క్లెయిమ్ సెటిల్ చేస్తారు. 

EPF Claim: ఈపీఎఫ్ గుడ్ న్యూస్.. క్లెయిమ్‌ కోసం చెక్ అవసరం లేదు!
New Update

EPF Claim:  ప్రయివేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ మంచి సేవింగ్స్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నెల నెలా జీతం నుంచి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఆటోమేటిక్ గా సంస్థల యాజమాన్యం కట్ చేసి.. తమ కంట్రిబ్యూషన్ తో కలిపి ఈపీఎఫ్ ఎకౌంట్ లో జమచేస్తుంది. దీనిపై ప్రభుత్వం మంచి వడ్డీరేటు ఇస్తుంది. ఈపీఎఫ్ లో జమ అయిన డబ్బులను మధ్యలో ఏదైనా అత్యవసర సమయంలో విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివలన చిన్న ఉద్యోగులకు ఇది మంచి సేవింగ్స్ ఎంపికగా భావించవచ్చు. గతంలో ఈపీఎఫ్ నుంచి డబ్బు విత్ డ్రా  చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈపీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడం ఆన్ లైన్ లోనే సులభంగా చేసుకునే వెసులుబాటు తీసుకువచ్చింది ప్రభుత్వం. గత కొంత కాలంగా ఈపీఎఫ్ కు సంబంధించి చాలా మార్పులు ఉద్యోగులకు అనుకూలంగా తీసిఉంటూ వస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో మరో కొత్త మార్పును తీసుకువచ్చారు. 

EPF Claim:  ఈపీఎఫ్ క్లెయిమ్ కోసం క్యాన్సిల్డ్ చెక్ లేదా బ్యాంక్ పాస్ బుక్ ను సబ్మిట్ చేయడం తప్పనిసరిగా ఇప్పటివరకూ నిబంధన ఉంది. వాటిలో ఎదో ఒకటి లేకపోతే క్లైయిమ్ తిరస్కరించేవారు. ఇకపై చెక్ బుక్.. పాస్ బుక్ లేకపోయినా ఈపీఎఫ్ నుంచి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్ బ్యాంక్ ఎకౌంట్ వివరాల కేవైసీ ఈపీఎఫ్ ఎకౌంట్ తో అప్ డేట్ చేసుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. చందాదారుడి ఎకౌంట్ వివరాలను బ్యాంక్, ఆధార్ కేవైసీ ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్ లకు చెక్ బుక్ లేదా బ్యాంక్ పాస్ బుక్ జతచేయాల్సిన వసరం లేదని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇలా కేవైసీ పూర్తి చేసిన ఉద్యోగులకు వారి ఈపీఎఫ్ క్లెయిమ్ అప్లికేషన్ లో బ్యాంక్ ఆన్‌లైన్లో ధ్రువీకరణ పూర్తయింది. చెక్, పాస్‌ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అంటూ నోట్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఈపీఎఫ్ ఉద్యోగులు.. చందాదారుల క్లెయిమ్ అప్లికేషన్స్ క్లియర్ చేయాలని ఈపీఎఫ్ఓ ఆదేశాలు జారీ చేసింది. 

#epfo-claim #epfo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి