ఇలాంటి వ్యాపారాలకు 10లక్షల సబ్సిడీ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం!

కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల కంపెనీలను ప్రోత్సహిస్తోంది. అలాంటి కంపెనీలు పెట్టేవారికి మంచి సబ్సిడీలు, రుణాలూ లభిస్తున్నాయి. అలాంటి ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాంటి వ్యాపారాలకు 10లక్షల సబ్సిడీ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం!
New Update

మీరు అగ్రిమాక్స్ ఫుడ్స్ LLP ( Agrimax Foods LLP) కంపెనీ గురించి వినే ఉంటారు. ఈ కంపెనీ ఒక ఫుడ్ సొల్యూషన్స్ కంపెనీ. తాజాగా ఇది బేక్ అండ్ కో (Bake &Co) అనే కొత్త బ్రాండ్‌ని ప్రారంభించింది. ఈ కొత్త బ్రాండ్ ద్వారా.. మిల్లెట్లతో తయారుచేసే బేకరీ ఉత్పత్తులను అమ్ముతున్నారు. అందువల్ల ఈ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివనీ, ఎక్కువ పోషకాలను ఇస్తాయనీ, మంచి రుచి కలిగివుంటాయని చెబుతున్నారు. ఐతే.. బేక్ అండ్ కో బ్రాండ్ ప్రారంభం వెనక కేంద్ర ప్రభుత్వ PMFME స్కీమ్ ప్రోత్సాహం ఉంది. ఈ పథకం ద్వారా కేంద్రం దేశవ్యాప్తంగా చిన్న ఫుడ్ వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది.

అగ్రిమాక్స్ ఫుడ్స్ కంపెనీని.. రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ప్రారంభించారు. అలాగే రైతుల ఉత్పత్తులను ప్రజలకు చేరేలా చైన్ విధానంలో ఈ కంపెనీని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కంపెనీ రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించి.. వాటిని చక్కగా ప్రాసెస్ చేసి.. వినియోగదారులకు చేరవేస్తోంది.

బేక్ అండ్ కో ద్వారా వినియోగదారులకు ఆరోగ్యకరమైన స్నాక్స్ లభిస్తాయని చెబుతున్నారు. కుకీలు, మిల్లెట్ కుకీలు, బిస్కెట్ల వంటి వాటిలో ప్రమాదకరమైన గ్లుటెన్ (gluten) ఉండదనీ, షుగర్ ఉండదనీ, ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవని చెబుతున్నారు. అలాగే.. ఈ స్నాక్స్‌ని మిల్లెట్స్, ఓట్స్, నట్స్, సీడ్స్, సహజమైన బెల్లంతో తయారుచేస్తున్నట్లు తెలిపారు.

ఇండియాలో మిల్లెట్ ఆధారిత ఆహార మార్కెట్ వృద్ధిరేటు 2022 నుంచి 2032 మధ్య 9.2 శాతం ఉంటుందని CAGR అంచనా వేసింది. ఇది 2023 నాటికి మిల్లెట్ మార్కెట్ విలువ రూ.759 కోట్లకు చేరుతుందనే అంచనా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌లో మిల్లెట్ కుకీల తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేసింది బేక్ అండ్ కో. ఈ కంపెనీ ఏర్పాటుకి కేంద్రం రూ.10 లక్షల సబ్సిడీ ఇచ్చింది. కారణం.. కేంద్రం PMFME స్కీమ్ తెచ్చిందే, ఇలాంటి స్థానిక ఆహార కంపెనీలను ప్రోత్సహించడానికి. మీరు కూడా ఇలాంటిది ప్రారంభించాలి అనుకుంటే.. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ (https://pmfme.mofpi.gov.in/pmfme/#/Home-Page)లో అప్లై చేసుకోవచ్చు.

ఈ పథకం కింద కేంద్రం సబ్సిడీ మనీ ఇవ్వడం మాత్రమే కాదు.. కంపెనీ ఏర్పాటుకి అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. అలాగే మార్కెటింగ్ సదుపాయాలు, కావాల్సిన యంత్ర సామాగ్రిపై పూర్తి వివరాలు ఇస్తోంది. స్థానిక అధికారులతో అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఇలాంటి కంపెనీల ఏర్పాటుకి ముందుకొస్తున్నారు.

#pm-modi #pm-narendra-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe