Rajasthan: ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చిన ఎద్దు.. వీడియో వైరల్!

రాజస్థాన్‌ అగ్దావా ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ వద్ద భద్రతా లోపం బయటపడింది. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా C295 విమానం ల్యాండింగ్ అవగానే అకస్మాత్తుగా ఒక ఎద్దు ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చి గందరగోళం సృష్టించింది. భద్రతా సిబ్బంది, కమాండోలు భయాందోళనకు గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది.

Rajasthan: ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చిన ఎద్దు.. వీడియో వైరల్!
New Update

Air strip: రాజస్థాన్‌లోని సంచోర్‌లోని చితల్వానా అగ్దావా వద్ద నిర్మించిన NH925Aలోని ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్ వద్ద భద్రతా లోపం బయటపడింది. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా C295 రవాణా విమానం ల్యాండింగ్ అవగానే అకస్మాత్తుగా ఒక ఎద్దు ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చింది. ఎయిర్ స్ట్రిప్ వద్దకు చేరుకుని గందరగోళం సృష్టించింది. అయితే ఆ ఎద్దు విమానం సమీపంలోకి చేరుకోకముందే గరుడ కమాండోలు ఎయిర్‌స్ట్రిప్ కు దూరంగా తరిమికొట్టగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

భయాందోళనకు గురైన సిబ్బంది..
ఈ మేరకు ఫైటర్ ప్లేన్ తేజస్ సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భారతమాల ప్రాజెక్ట్ హైవే (NH 925A)పై ల్యాండ్ అయింది. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులోని సంచోర్-బార్మర్ జిల్లాకు ఆనుకుని ఉన్న అగాద్వా గుండా వెళుతున్న ఈ హైవేపై తేజస్ మొదట టచ్ చేసి వెళ్లింది. ఆ తర్వాత తేజస్ దిగింది. ఆ తర్వాత యుద్ధ విమానం జాగ్వార్ కూడా దిగింది. అయితే అకస్మాత్తుగా విమానం వద్దకు ఎద్దు రావడంతో ఎయిర్‌స్ట్రిప్‌పై నిలబడి ఉన్న భద్రతా సిబ్బంది, కమాండోలు భయాందోళనకు గురైనట్లు తెలిపారు. అయితే ఈ భద్రతా వైఫల్యంపై అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

#rajasthan #bull-reached-the-air-strip
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe