బీహార్ లో కుప్పకూలిన వంతెన..ఆవిరైన రూ.12 కోట్లు! షాకింగ్ వీడియో!

బిహార్‌ అరారియా జిల్లాలో కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం కూలిపోయింది. దీంతో ఈ వంతెన నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.12 కోట్లు నేలపాలైయ్యాయి.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

బీహార్ లో కుప్పకూలిన వంతెన..ఆవిరైన రూ.12 కోట్లు! షాకింగ్ వీడియో!
New Update

బీహార్‌లోని అరారియా జిల్లాలో బాగ్రా నదిపై నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం కూలిపోయింది.మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. అలాంటి వేళ వంతెన కూలిపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారుల కారణంగానే ఈ వంతెన కూలి పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రూ.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన నాసిరకమైన పనులవల్లే ఇది జరిగిందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. 2021 తర్వాత, ప్రారంభోత్సవ వేడుకలకు ముందు బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయి నదిలో పడిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

#viral-video #bihar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe