/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-19T194451.555.jpg)
బీహార్‌లోని అరారియా జిల్లాలో బాగ్రా నదిపై నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. కుర్సాకాంతా, సిక్తి మధ్య బాక్రా నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం కూలిపోయింది.మరికొద్ది రోజుల్లో ఈ వంతెన ప్రారంభం కానుంది. అలాంటి వేళ వంతెన కూలిపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోపాటు ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారుల కారణంగానే ఈ వంతెన కూలి పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రూ.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన నాసిరకమైన పనులవల్లే ఇది జరిగిందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. 2021 తర్వాత, ప్రారంభోత్సవ వేడుకలకు ముందు బీహార్‌లోని వివిధ ప్రాంతాల్లో వంతెనలు కూలిపోయి నదిలో పడిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
Bihar, Araria: The Padariya bridge, connecting Araria's Sikhti block and Kursakatta block, got submerged in the river during its construction. The construction of the bridge to connect the river to the bank resumed at a cost of 12 crores pic.twitter.com/dPv4brMTXa
— IANS (@ians_india) June 18, 2024