యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

హైదరాబాద్ నార్సింగ్‌లో ఘోరం జరిగింది. యువతిని మాట్లాడాలని పిలిపించి ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో యువతి మెడపై, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

New Update
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు

The boyfriend attacked the young woman with a knife

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగర్‌లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరగటం అందరిని కల్వపెడుతోంది. ప్రభుత్వాలు మారే కొద్ది కొత్త చట్టాలు వస్తున్నాయి.. అయినా కూడా యువతులు, మహిళలు, చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిన్న ఓ ఘటన మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన నగరం నడిబొడ్డులో వెలుగు చూస్తోంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌లో హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. దారుణంగా యువతి గొంతు కోసాడు ఓ ప్రేమోన్మాది.

హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు పరువు హత్యలు భయపెడితే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జనాలను భయఆందోళనకు గురి చేస్తున్నాయి. బోరబండలో జరిగిన సీన్ రిపీటైంది. యువతితో మాట్లాడాలని బలవంతంగా రప్పించాడు ఓ యువకుడు. ఆ తర్వాత మాటకు మాట పెరగడంతో గొడవ ఎక్కువైంది.. దాంతో కోపంతో రగిలి పోయిన యువకుడు అమ్మాయిపై దాడి చేశాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి అక్కడ నుంచి పారారయ్యాడు.

నార్సింగ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మాట్లాడాలని నార్సింగీ టీ గ్రీల్ హోటల్ వద్దకు పిలిపించిన యువకుడు.. మాటల మధ్యలో ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఒక్క సారిగా బ్యాగ్‌లో ఉన్న కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో యువతికి మెడపై, చేతులకు తీవ్ర గాయాలైయ్యాయి. అది గమనించిన స్థానికులు యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకోని కేసు నమోదు చేశారు. ఆంద్రప్రదేశ్ పిడుగురాళ్లకు చెందిన యువతి వాసవీగా.. యువకుడు గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన గణేష్‌గా గుర్తించారు.. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. యువకుడి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు