Cricket Wonder: ఏయ్.. ఇలా కూడా ఔట్ అవుతారా? పాపం ఆ బ్యాట్స్‌మెన్!

ఏ బ్యాట్స్‌మెన్‌కి ఇలాంటి దురదృష్టం రాకూడదు.. ఇంగ్లండ్‌లోని వార్మ్స్లీలో జరిగిన టీ20 ఫైనల్‌లో సోమర్‌సెట్ బ్యాట్స్‌మెన్ నెడ్ లియోనార్డ్‌ అవుట్ అయిన విధానం చూసి అభిమానులంతా జాలి పడుతున్నారు. ఎలా అవుటయ్యాడో ఇక్కడ వీడియోలో చూస్తే మీరు కూడా అయ్యో! అంటారు. 

New Update
Cricket Wonder: ఏయ్.. ఇలా కూడా ఔట్ అవుతారా? పాపం ఆ బ్యాట్స్‌మెన్!

Cricket Wonder: క్రికెట్ గ్రౌండ్స్ లో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఒక్కోసారి రెప్పపాటులో జరిగే కొన్ని విషయాలు చాలాకాలం అభిమానులను వెంటాడుతూనే ఉంటాయి. ఇదిగో సరిగ్గా అలాంటిదే ఈసారి ఇంగ్లాండ్‌లోని వార్మ్స్లీలో సోమర్‌సెట్ బ్యాట్స్‌మెన్ నెడ్ లియోనార్డ్‌ విషయంలో జరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అద్భుతమైన షాట్లు ఆడినప్పటికీ, తన భాగస్వామి కారణంగా ఈ ఆటగాడు అవుట్ అయ్యాడు. క్రికెట్ మైదానంలో ఒక బ్యాట్స్‌మెన్ 10 విధాలుగా ఔట్ అవడానికి ఛాన్స్ ఉంది. అందులో ఇది కూడా ఒకటి. కానీ, ఇది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. నెడ్ లియోనార్డ్ ఔట్ అయిన తీరు చూస్తే ప్రతి బ్యాట్స్‌మెన్ షాక్ అవుతారు

లియోనార్డ్ ఎలా దొరికిపోయాడంటే..
Cricket Wonder: సోమర్‌సెట్, యార్క్‌షైర్‌లోని సెకండ్ ఎలెవన్ జట్టు మధ్య టీ20 ఫైనల్ జరుగుతోంది. 19వ ఓవర్‌లో బెన్ క్లిఫ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. లియోనార్డ్ తన రెండో బంతికి వేగంగా షాట్ ఆడాడు. కానీ నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలబడిన బ్యాట్స్‌మన్‌ నడుముకు ఆ బాల్  తగిలింది. తగిలిన బంతి ఊరికే ఉంటుందా? గాలిలోకి లేచింది. అంతే.. బౌలర్ ఆలస్యం చేయడు కదా అవకాశాన్ని క్యాచ్ రూపంలో అందుకున్నాడు. దీంతో పాపం లియోనార్డ్ ఔట్ అయ్యాడు. లియోనార్డ్‌ను అవుట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లియోనార్డ్ వికెట్ చూసి కామెంట్రేటర్స్ కూడా చాలా విచారంగా కనిపించారు. ఇక లియొనార్డ్ తన అవుట్ చూసి..  తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.  ఇక, మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్‌లో బెన్ క్లిఫ్ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సోమర్‌సెట్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆ బ్యాటర్ అవుటయిన విధానం మీరూ ఇక్కడ చూసేయండి.. కచ్చితంగా అతని మీద జాలి పడతారు..

ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనూ ఒకసారి.. 
Cricket Wonder: అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇలాంటి ఘటనే జరిగింది. దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ శ్రీలంకపై బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను జెహాన్ ముబారక్ బంతిపై పదునైన షాట్ ఆడాడు.  కాని బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడి ఉన్న మైఖేల్ క్లార్క్ బూట్లకు తగిలి తిలకరత్నే దిల్షాన్ చేతుల్లోకి వెళ్లింది. సైమండ్స్ దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు.

Advertisment
తాజా కథనాలు