TS News : అది 1984 ఆగస్టు.. కంగ్రెస్(Congress) కంచుకోటను బద్దలు కొట్టి ఎన్టీఆర్(NTR) ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి అప్పటికి ఏడాది మాత్రమే. ఆ సమయంలో గుండె ఆపరేషన్ కోసం అమెరికా(America) కు వెళ్లిన ఎన్టీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చారు నాదేండ్ల భాస్కర్ రావు(Nadendla Bhaskar Rao). పార్టీలో అసమ్మతిని, తన పాత పార్టీ కాంగ్రెస్ అండను ఆయుధంగా మార్చుకుని ఎన్టీఆర్ ను దించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ పై ఆగస్టు నెలలోనే తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటినుంచి తెలుగు రాజకీయాల్లో ‘ఆగస్టు సంక్షోభం'(August Crisis) అనే మాట తరచూ వినపడుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం ఆగస్టు సంక్షోభం తప్పదంటూ బీజేపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.\
పూర్తిగా చదవండి..August Crisis : తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా ‘ఆగస్టు సంక్షోభం’.. దాని చరిత్ర ఏంటో తెలుసా?
తెలుగు రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత సీఎం రేవంత్ కు ఆగస్టు సంక్షోభం తప్పదని హెచ్చరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఈ ఆగస్టు సంక్షోభం అంటే ఏమిటీ? దీని చరిత్ర తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: