Golden Globe Awards 2024 : 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు(Golden Globe Award) ల వేడుక లాస్ ఏంజిల్స్(Las Angeles) లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన సినీ తారలు.. విభిన్న వేషాధారణలో అభిమానులను అలరించారు. ముఖ్యంగా నటీమణులు బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్(Black & White Out Fit) హోయల్ పోతూ వేడుకను కలర్ ఫుల్ గా మార్చేశారు.
'ఓపెన్‌హైమర్' హవా..
ఇక అవార్డుల విషయానికొస్తే.. బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా(Best Motion Picture Drama) కేటగిరీలో 'ఓపెన్‌హైమర్'(Oppenheimer) ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. అలాగే ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన సిలియన్ మర్ఫీ బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు(Best Male Actor Award) దక్కించుకుంది. గతేడాది ఆర్ఆర్ఆర్(RRR) ఇదే అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ -మోషన్ పిక్చర్ కేటగిరీలో అవార్డు అందుకున్న ఆమె మరోసారి అవార్డు చేజిక్కించుకోవడం విశేషం. కాగా నోలాన్ తొలిసారి బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అందుకున్నాడు.
'గోల్డెన్ గ్లోబ్స్ 2024'లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే..
ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్
ఉత్తమ కామెడీ చిత్రం- పూర్ థింగ్స్
ఉత్తమ దర్శకుడు - క్రిస్టఫర్ నోలన్(ఓపెన్‌హైమర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్ సాగ్ ట్రైట్, ఆర్ధర్ హరారి ( అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్)
ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్)
ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - వాట్ వాస్ ఐ మేడ్ (బార్బీ) (Barbie)
ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్
బాక్సాఫీస్ అచీవ్‌మెంట్ అవార్డు - వార్నర్ బ్రదర్స్(బార్బీ)
ఇది కూడా చదవండి : Mumbai Indians: రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్ పోస్ట్.. అంబానీ మావకు ఇచ్చి పడేశాడుగా!
ఇక 2023లో సంచలనం రేపిన 'బార్బీ'(Barbie) మూవీ తొలిసారి ప్రవేశపెట్టిన సినిమాటిక్ అండ్ బాక్సాఫీస్ అచీవ్‌మెంట్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అవార్డు అందుకుంది. దీనికి మ్యూజిక్ అందించిన ఓకానెల్ బ్రదర్స్ 2021లోనూ నో టైమ్ టు డై మూవీ టైటిల్ ట్రాక్ కోసం కూడా అవార్డు గెలుచుకోవడం విశేషం. ఇక బుల్లితెర విషయానికి వస్తే హెచ్‌బీవో రూపొందించిన సక్సెషన్(Succession) సిరీస్ బెస్ట్ టెలివిజన్ సిరీస్ డ్రామా కేటగిరీలో అవార్డు గెలిచింది. గతేడాది ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిన బెస్ట్ మోషన్ పిక్చర్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఈసారి అవార్డు అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (నియోన్) అనే ఫ్రెంచ్ మూవీకి అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.