/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-08T205728.556.jpg)
Crime: ఏపీలో దారుణం జరిగింది. బిస్కెట్ పసి బాలుడి ప్రాణం తీసింది. ఈ మేరకు తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం బొందుగుడ గ్రామానికి చెందిన తేజ అనే మూడు సంవత్సరాల బాలుడు బిస్కెట్ తింటుండగా గొంతులో అడ్డుపడింది. వెంటనే అప్రమత్తమైన పేరెంట్స్ అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఊపిరాడక కొట్టుమిట్టాడిన బాలుడు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.