T20 World Cup 2024: 10 వేదికలు.. 26 రోజులు.. 55 మ్యాచులు.. మరికొన్ని రోజుల్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది. యావత్ ప్రపంచమంతా క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐసీసీ మరో శుభవార్త అందించింది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ తేదీతో పాటు వేదికలను ప్రకటించింది. By BalaMurali Krishna 23 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి T20 World Cup 2024: మరికొన్ని రోజుల్లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనుంది. యావత్ ప్రపంచమంతా క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐసీసీ మరో శుభవార్త అందించింది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ తేదీతో పాటు వేదికలను ప్రకటించింది. ఈ ప్రపంచకప్‌నకు వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా అతిథ్యం ఇవ్వనుండటం విశేషం. ఏడు వేదికలు కరేబియన్ దేశాలకు చెందినవి కాగా, మూడు వేదికలు అమెరికాకు చెందినవి ఉన్నాయి. కరేబియన్ దేశాలలో ఆంటిగ్వా, బార్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్, టొబాగో ఉండగా.. అమెరికాలో న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడా ఉన్నాయి. మొత్తం 10 వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. తొలిసారిగా 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్ టోర్నీ 2024 జూన్ 4నప్రారంభమై.. జూన్ 30న ముగియనుంది. మొత్తం 26 రోజుల పాటు 55 మ్యాచులు జరగనున్నాయి. అయితే 2024 టీ20 ప్రపంచ కప్‌కి సంబంధించి ఇప్పటివరకు తేదీలు, వేదికలు మాత్రమే ఐసీసీ నిర్ణయించింది కానీ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ టోర్నమెంట్‌ను అద్భుతంగా నిర్వహించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్ తెలిపారు. మ్యాచుల కోసం ఎంపిక చేసిన స్టేడియాలను మరింత మెరుగుపరిచి అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. The 10 venues for the ICC Men's #T20WorldCup 2024 😍 Details ➡️ https://t.co/8SF5f7SSwI pic.twitter.com/9kf0cWgpp3 — ICC (@ICC) September 23, 2023 మరోవైపు భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో న్యూజిలాండ్ తలపడే మ్యాచుతో టోర్నీ ఆరంభం కానుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన యాడ్స్, ప్రమోషన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. అభిమానుల్లో క్రికెట్ ఫీవర్ ఆల్రెడీ పట్టుకుంది. దీనిని మరింత పెంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇప్పుడు టోర్నీకి సంబంధించి ఓ అధికారిక సాంగ్ ను విడుదల చేసింది. వరల్డ్ కప్ కోస్ ఐసీసీ ప్రత్యేకంగా పాటను రూపొందించింది. దిల్ జషన్ జషన్ బోలే అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించాడు. ప్రీతమ్ చక్రవర్తి పాటను కంపోజ్ చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే ఈ పాటలో రణవీర్ సింగ్ తో పాటూ టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ కూడా ఆడి పాడారు. సోసల్ మీడియాలో వరల్డ్ కప్ స్పెషల్ సాంగ్ దుమ్ము రేపుతోంది. ఇది కూడా చదవండి: అదరగొట్టిన టీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్.. #cricket #sports #icc-t20-worldcup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి