Hero Vijay: అమ్మ కోసం గుడి కట్టిన స్టార్ హీరో.. సలాం దళపతి అంటున్న ఫ్యాన్స్

హీరో విజయ్ తన అమ్మ కోసం చెన్నైలోని కొరట్టూర్‌లో సొంత డబ్బులతో సాయి బాబా ఆలయాన్ని కట్టించారనే వార్త వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని పై విజయ్ తల్లి శోభ స్పందించారు. "నా కోసం నా కొడుకు కట్టించిన గుడికి వచ్చి బాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు."

Hero Vijay: అమ్మ కోసం గుడి కట్టిన స్టార్ హీరో.. సలాం దళపతి అంటున్న ఫ్యాన్స్
New Update

Hero Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా రాణిస్తూనే .. ఇటీవలే రాజకీయ అరంగేట్రం కూడా చేశారు. తమిళగ వెట్రి కళగం పార్టీనీ స్థాపించారు. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

తల్లి కోసం గుడి కట్టిన విజయ్

ఇది ఇలా ఉంటే.. తాజాగా అమ్మ కోసం హీరో విజయ్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. విజయ్ కి తన తల్లి శోభ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ ఇష్టం ఎంతలా అంటే.. ఏకంగా తల్లి కోసం గుడి కట్టేశారట విజయ్.

నా కొడుకు .. నా కోరికను అర్ధం చేసుకున్నాడు

అయితే విజయ్ తల్లి శోభకు ఎప్పటి నుంచో సాయి బాబా గుడి కట్టాలనే కోరిక ఉండేదట. దీంతో విజయ్ తన తల్లి కోరిక తీర్చడానికి చెన్నైలోని తన స్థానిక నివాసం కొరట్టూరులో సాయి బాబా ఆలయాన్ని నిర్మించినట్లు వార్తలు వైరల్అవుతున్నాయి. తాజాగా దీని పై స్పందించిన విజయ్ అమ్మ శోభ ఇలా మాట్లాడారు.. "తాను సాయి బాబా భక్తురాలినని. ఎప్పటి నుంచో సాయి బాబా గుడి కట్టాలనే కోరిక ఉండేదని. ఈ విషయాన్ని తన కొడుకు విజయ్ తో కూడా చాలా సార్లు చెప్పానని అన్నారు. తన కోరికను అర్ధం చేసుకున్న విజయ్ తన కోసం ఆలయాన్ని కట్టించడం ఆనందంగా ఉందని. తన కోసం.. తన కొడుకు కట్టించిన ఆలయాన్ని దర్శించుకోవడం తనకేదో తెలియని ఆనందం, మనశ్శాంతి కలిగించిందని చెప్పారు." తల్లి కోసం హీరో విజయ్ ఆలయం కట్టించడం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kriti Sanon: హీరోలు పోటుగాళ్లేమీ కాదు.. వాళ్లు లేకపోతే సినిమా హిట్ కాదా? ఇండస్ట్రీలో కృతి దుమారం!

#tamil-hero-vijay #vijay-gifted-temple-for-his-mother
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe