The GOAT : పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ తో 'ది గోట్' ట్రైలర్.. తండ్రీ,కొడుకులుగా అదరగొట్టిన దళపతి విజయ్

దళపతి విజయ్ 'ది గోట్' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఆయన ఇంటర్నేషనల్ స్పై ఏజెంట్ గా కనిపించారు. అంతేకాకుండా విజయ్ డబుల్ రోల్‌లో కనిపించడం హైలైట్. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ కలగలిపిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

The GOAT : పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ తో 'ది గోట్' ట్రైలర్.. తండ్రీ,కొడుకులుగా అదరగొట్టిన దళపతి విజయ్
New Update

Thalapathy Vijay's The GOAT Trailer : దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫుల్‌స్టాప్ పడింది. ఆయన నటించిన 'GOAT' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఇందులో విజయ్ ఇంటర్నేషనల్ స్పై ఏజెంట్ గా కనిపించారు. అంతేకాకుండా విజయ్ డబుల్ రోల్‌లో కనిపించడం హైలైట్.

యాక్షన్, కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ కలగలిపిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలువనుందని అభిమానులు భావిస్తున్నారు. తండ్రి పాత్రలో విజయ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తే కొడుకుగా యంగ్ అండ్ స్టైలిష్ మేకోవర్ తో ఆకట్టుకున్నారు. ఇక ట్రైలర్ లో ఈ తండ్రీ,కొడుకుల యాక్షన్ చూసిన ఫ్యాన్స్ రేపు థియేటర్స్ లో ఈ సీన్స్ కి థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ అని అంటున్నారు.

Also Read : ‘రాజా సాబ్’ సెట్స్ లో నిధి అగర్వాల్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు వైరల్!

ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా, ప్రశాంత్, మోహన్, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, వైభవ్, యోగి బాబు, ప్రేమ్గి అమరన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

#thalapathy-vijay #the-goat-trailer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe