The GOAT : విజయ్ 'గోట్' నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్!

తలపతి విజయ్ 'గోట్' మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'చిన్నచిన్నకంగాళ్' అనే టైటిల్ లో ఉన్న సాంగ్‌ను విజ‌య్‌తో పాటు యువన్ శంకర్ రాజా, రాజా భ‌వ‌త‌రిని కలిసి పాడారు. క‌బిల‌న్ వైర‌ముత్తు సాహిత్యం అందించిన ఈ పాట‌కు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు

The GOAT : విజయ్ 'గోట్' నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్!
New Update

The GOAT Movie Second Single Out : కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేయగా.. ఆ మధ్యే 'విజిల్ పోడు' అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న విజయ్ బర్త్ డే కానుకగా 'The GOAT Bday Shots' అనే పేరుతో స్పెషల్ గ్లింప్స్​ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డ్యూయల్ రోల్లో కనిపించారు విజయ్. డ్యూయల్ రోల్లో బైక్ పై విజయ్ యాక్షన్​ సీక్వెన్స్, స్టెంట్స్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇక నేడు సెకెండ్ సింగిల్ ను వదిలారు.

ఆకట్టుకునే మెలోడీ...

గోట్ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ 'చిన్నచిన్నకంగాళ్' అనే సాంగ్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేశారు. ఫ్యామిలీ ఎమోష‌న‌ల్‌గా సాగిన ఈ పాట‌ను విజ‌య్‌తో పాటు యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja), రాజా భ‌వ‌త‌రిని కలిసి పాడారు. క‌బిల‌న్ వైర‌ముత్తు సాహిత్యం అందించిన ఈ పాట‌కు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఇక ఈ లిరికల్ వీడియోని ఆర్ట్ స్కెచ్ తో సరికొత్తగా రూపొందించారు.

Also Read : మహేష్ కొడుకు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. గౌతమ్ యాక్టింగ్ పై నమ్రత పోస్ట్.. గర్వంగా ఉందంటూ!

అక్కడక్కడ కొన్ని విజువల్స్ కూడా చూపించారు. ఇందులో విజయ్,స్నేహ (Sneha) భార్య, భర్తలుగా కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ రష్యాలో జరుగుతోంది. అక్కడ విజ‌య‌పై యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇటీవలే వెల్ల‌డించారు.

#thalapathy-vijay #goat-second-single #the-goat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి