Thalapathy Vijay Remunaration For His Last Movie : కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ లాస్ట్ మూవీకి సంబంధించి తమిళ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. రీసెంట్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'ది గోట్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
ఈ సినిమా తర్వాత తన లాస్ట్ ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నాడు. విజయ్ కు ఇది 69 వ సినిమా. కాగా సినిమా కోసం తలపతి విజయ్ రెమ్యునరేషన్ వివరాలు కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో కాదా? విలన్ రోల్ చేస్తున్నాడా?
అన్ని కోట్లా?
విజయ్ తన లాస్ట్ మూవీకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తాజా సంచారం ప్రకారం.. 'తళపతి 69' కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్లు (+జీఎస్టీ) తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఈ ఫిగర్‌తో ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా విజయ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి మొదట ఈ ప్రాజెక్ట్ ని DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య నిర్మించాల్సింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల దానయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆస్థానంలో సన్ పిక్చర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది.