RRR Movie : దర్శక దిగ్గజం S S రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'RRR' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2022 లో విడుదలైన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ అద్భుత నటన కనబరిచారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. సినిమా రిలీజై దాదాపు రెండేళ్లకు పైగా కావస్తున్నా ఎక్కడో చోట RRR పేరు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ పై హాలీవుడ్ యాక్టర్ లూకాస్ బ్రావో ప్రశంసలు వర్షం కురిపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
What a high 🔥❤️#LucasBravo French Actor :
The Main Actor in RRR,#RamCharan ❤️🫶🔥The #Chainsmokers Group Member Alexpall Want To Collab With Ram Charan @AlwaysRamCharan pic.twitter.com/9LH35dmUqD
— It's R€ & PK Trends™ (@AlwaysParandam) August 15, 2024
Also Read : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్
'RRR' లో మెయిన్ హీరో రామ్ చరణ్ నటన అద్భుతం. ఆయన పాత్రలోకి ఎంతగా మునిగిపోతారో చూస్తే ఆశ్చర్యపోయాను. ప్రతి సన్నివేశంలో ఆయన కళ్ళు మాట్లాడతాయి. ముఖ్యంగా సినిమాలో ఎంట్రీ సీన్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నారు' అని అన్నారు. ఈ వీడియోని మెగా ఫ్యాన్స్ ఎక్స్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు.