TGPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచే అందుబాటులోకి..

జూన్ 24నుంచి గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచబోతున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

New Update
TG News: తెలంగాణలో ఆ రెండు పరీక్షలు రద్దు!

TGPSC Group 1 OMR Sheets: గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు సంబంధించి టీజీపీఎస్సీ (TGPSC) కీలక ప్రకటన జారీ చేసింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను జూన్ 24న సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచబోతున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో తమ వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

ఇక ఇటీవల జరిగిన గ్రూప్ -1 ఉద్యోగాలకోసం 4,03,667 అప్లికేషన్లు రాగా.. 3,02,172 మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధిత ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జూన్‌ 13న విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే జూన్‌ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు చేయగా.. 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Also Read: కమెడియన్ యోగి బాబు ‘చట్నీ- సాంబార్’.. త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు