Telangana: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డుస్థాయిలో హాజరు.. ఎంత శాతం పెరిగిందంటే!

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో హాజరు శాతం నమోదైంది. గతంతో పోలిస్తే 12.63 శాతం పెరగగా మొత్తం 74 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 563 పోస్టులకు 4.03 లక్షల దరఖాస్తులు రాగా 3.02లక్షల మంది పరీక్ష రాశారు.

Telangana: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డుస్థాయిలో హాజరు.. ఎంత శాతం పెరిగిందంటే!
New Update

TGPSC: తెలంగాణలో టీజీపీఎస్సీ జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో జరిగిన పరీక్షతో పోలిస్తే ఈసారి ఏకంగా 12.63 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02లక్షల మంది పరీక్ష రాశారు. మొత్తంగా 74 శాతం హాజరు నమోదైంది. గతంలో రద్దయిన రెండు ప్రిలిమినరీ పరీక్షలను పరిగణనలోకి తీసుకుంటే సంఖ్యాపరంగా మూడు లక్షలకు మందికి పైగా అభ్యర్థులు గ్రూప్‌-1 పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు.

మూడోసారికి గణనీయంగా పెరిగిన శాతం..
ఇక పాతగ్రూప్‌-1 ప్రకటన రద్దుచేసిన టీజీపీఎస్సీ కమిషన్‌ 60 అదనపు పోస్టులు కలిపి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొదట 503 పోస్టులతో గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటన వెలువడగా.. 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా 75 శాతం హాజరుతో 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్ష రద్దయింది. దంతో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతేడాది జూన్‌ 11న రెండోసారి ప్రిలిమినరీ నిర్వహించింది. కానీ ఈ పరీక్షకు హాజరు గణనీయంగా 61.37శాతానికి పడిపోయింది. కేవలం 2.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే గ్రూప్‌-4 మెరిట్‌ జాబితా వెల్లడించిన కమిషన్‌ త్వరలో ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల తుది ఫలితాలు ఇవ్వనుంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి కాగా త్వరలో ఎంపిక జాబితా వెల్లడించాలని భావిస్తోంది. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభించనుంది. గ్రూప్‌-4 ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన వెంటనే ఏఈ పోస్టుల పరిశీలన ప్రారంభించ అవకాశం ఉంది.

#tgpsc #group-1-preliminary
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి