Telangana: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉదయం 8.30 ఒడిశాను అనుకొని ఛత్తీస్‌గడ్ మీదుగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
రానున్న 12గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడే అవకాశలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ క్రమంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Also read: 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..!