Telangana: బాలిక అవాంఛనీయ గర్భం తొలగించేందుకు హైకోర్టు అనుమతి!

అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిస్తూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ బాలిక, తల్లి అనుమతి తీసుకుని గర్భం తొలగించాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు ఆదేశాలు జారీ చేసింది.

Telangana: బాలిక అవాంఛనీయ గర్భం తొలగించేందుకు హైకోర్టు అనుమతి!
New Update

Telangana: అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భాన్ని తొలగించేందుకు అనుమతినిస్తూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ బాలిక, తల్లి అనుమతి తీసుకుని గర్భం తొలగించాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన ఓ బాలిక పై 10 మంది కామాంధులు 6 నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన పై గతంలో పోలీసు కేసు నమోదు అయ్యింది.

ఈ ఘటనలో బాలిక అవాంఛనీయ గర్భం దాల్చడంతో తొలగింపు నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా..డాక్టర్లు తిరస్కరించారు. దీంతో బాలిక తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై విజయ్‌ సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ గురువారం వాదనలు వినిపిస్తూ దుర్మార్గుల చర్య వల్ల బాలిక గర్భం దాల్చిందన్నారు.

26 వారాల గర్భస్థ పిండాన్ని తొలగించడానికి గాంధీ ఆసుపత్రి డాక్టర్లు నిరాకరించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేసి బాలిక ఆరోగ్య పరిస్థితులపై నివేదిక సమర్పించాలంటూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి పై సీల్డ్‌ కవర్‌ లో శుక్రవారం నివేదిక అందజేశారు.

నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ఇలాంటి ఘటనలు బాధాకరమని, బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. బాలిక, ఆమె తల్లి అనుమతితో అబార్షన్‌ కు చర్యలు తీసుకోవాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్‌ పై విచారణను మూసివేశారు.

Also read: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా

#telangana #high-court #allowed
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe