/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Rythu-Runa-Mafi-1.jpg)
Rythu Runa Mafi: రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. రుణమాఫీపై చర్చించేందుకు 15న మంత్రివర్గసమావేశం నిర్వహించనుంది. ఈ మీటింగ్ లో రుణమాఫీ విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఆగస్ట్ 15 లోపు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్ తరహాలోనే రుణమాఫీకి కసరత్తు చేసున్నారు. రుణమాఫీ అమలు ఏ డేట్ కటాఫ్‌గా తీసుకోవాలి?, అర్హులైన రైతులను గుర్తింపుకు విధివిధానాలు ఎలా ఉండాలి? అనే దానిపై చర్చించనున్నారు. పీఎం కిసాన్ తరహాలో అమలు చేస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీఛైర్మన్లు, ఆదాయ పన్ను కట్టేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ కట్ చేసే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.