Hyderabad : తెలంగాణ-ఏపీ (Telangana - Andhra Pradesh) ముఖ్యమంత్రుల భేటీ మొదలైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ (CM Revanth Reddy) తోపాటు భేటీకి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వేంనరేందర్‌రెడ్డి, వేణుగోపాల్, సీఎస్ హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు (CM Chandrababu) తో అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజాభవన్ (Praja Bhavan) దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు.
ఇక ఈ కీలకమైన భేటీలో ఏ సమస్యలు పరిష్కారం అవుతాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విభజన సమస్యల పరిష్కారం, ఉమ్మడి ఆస్తుల పంపకాలపైనే ప్రధాన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ భేటీలో తెరపైకి సరికొత్త డిమాండ్లు కూడా వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు ముందు రేవంత్ 6 డిమాండ్లు పెట్టగా.. జనాభా నిష్పత్తి ప్రకారమే ఆస్తుల పంపకం ఉండాలని కోరుతున్నారు. అలాగే ఈ సమావేశంలో ఉమ్మడి రాష్ట్రం అంశం తెరపైకి రానుంది.
Also Read : చంద్రబాబుకు రేవంత్ గిఫ్ట్ గా ఏ బుక్ ఇచ్చారో తెలుసా?