/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/sai-dharam-tej.jpg)
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీనటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల చిన్న పిల్లలపై అసభ్యకరంగా జోక్స్ వేస్తూ వీడియో చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ (X)లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. సాయిధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్ పై సానుకూలంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వెంటనే ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడిని బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన నివాసానికి వెళ్లారు సాయిధరమ్ తేజ్.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీనటుడు సాయిధరమ్ తేజ్.
Film actor Saidharam Tej paid a courtesy call to Chief Minister Revanth Reddy at his Jubilee Hills residence.
• @revanth_anumula
• @IamSaiDharamTej pic.twitter.com/rLMWAwk9Wd— Congress for Telangana (@Congress4TS) July 14, 2024
Also Read: వారికి గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్