TS TET 2024: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కీలక ప్రకటన!? తెలంగాణలో టెట్ పరీక్ష ఫీజు పెంపుపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. By srinivas 25 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TET: తెలంగాణలో టెట్ ఫీజ్ పెంపుపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు వందలున్న ఫీజు ఒకేసారి వెయ్యి రూపాయలు చేయడంతో నిరుద్యోగ సంఘాలు నిరసనలకు దిగాయి. దరఖాస్తు ఫీజు తగ్గించకపోతే ధర్నాకు దిగుతామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించాయి. రేవంత్ రెడ్డి దృష్టికి.. అయితే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఫీజుల పెంపుపై అధికారులు నివేదిక ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం. కాగా దీనిపై ఈ వారమే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇది కూడా చదవండి: Bandi Sanjay: ఖబడ్దార్.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? భారంగా పరీక్ష ఫీజులు.. ఇక గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు వరకు రెట్టింపు చేసింది. దీంతో పరీక్ష ఫీజులు చెల్లించడం తమకు భారంగా మారిందని, ఇలా చేయడం తగదని.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కో పేపర్‌కి వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాలనడం 4 లక్షల మంది అభ్యర్థులను మోసం చేయడమే అవుతుందని వాపోతున్నారు. #ts-tet-2024 #tet-fee-reduction మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి