T20 WC 2024: వరల్డ్ కప్ టోర్నీకి ఉగ్ర ముప్పు.. ఆ దేశం నుంచి బెదిరింపులు! ఈ యేడాది యూఎస్‌ఏ- విండీస్ వేదికల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఉగ్రముప్పు పొంచివున్నట్లు వస్తున్న వార్తలపై ఐసీసీ స్పందించింది. నార్త్ పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్న ఓ టెర్రరిస్ట్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. By srinivas 06 May 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి T20 WC 2024: జూన్ 2నుంచి టీ20 వరల్డ్ కప్ సంగ్రామం మొదలుకానున్న విషయం తెలిసిందే. కాగా ఈ యేడాది పొట్టి కప్ కు యూఎస్‌ఏ- విండీస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనబోయే దేశాలన్నీ తమ తుది జట్లను ప్రకటించేశాయి. ఇదిలావుంటే.. ఈ మెగా టోర్నీకి ఉగ్ర ముప్పు పొంచివున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఓ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి ఇప్పటికే బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ గ్యాంగ్.. ఈ మేరకు కరీబియన్ మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. నార్త్ పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్న ఓ టెర్రరిస్ట్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డట్లు చెప్పుకొచ్చాయి. అయితే దీనిపై వెంటనే స్పందించిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్ రౌలే, ఐసీసీ ప్రతినిధులు.. ‘ఐసీసీ అన్ని పరిస్థితులను గమనిస్తోంది. ఆతిథ్య దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ ఉగ్రముప్పు ప్రచారంపై అధికారయంత్రాంగంతో చర్చించాం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రతి ఆటగాడి భద్రతకు భరోసానిచ్చింది. భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి రిస్క్‌నైనా తట్టుకొనేలా చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దీనిపై పోరాడేందుకు సమాయత్తం కావాలి. అతిపెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు దక్కింది. దానిని విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపట్టాం' అని తెలిపారు. ఇది కూడా చదవండి: T20 World Cup : కోహ్లీ గురించి తప్పుగా అంచన వేస్తున్నారు.. మాజీలకు టామ్ మూడీ చురకలు! ఇక ఈ టోర్నీలో పాల్గొనబోయే 20 టీమ్‌లు 4 గ్రూప్‌లుగా విడిపోయి వరల్డ్ కప్ కోసం పోటీపడతాయి. బార్బడోస్ వేదికగా జూన్ 29న ఫైనల్ జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్, జూన్ 9న పాకిస్థాన్, జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో టీమ్‌ఇండియా తలపడనుంది. #t20-world-cup #terrorist-threats మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి