Jammu Kashmir: పూంచ్‎లో ఉగ్రదాడి.. నేలకొరిగిన ముగ్గురు జవాన్లు

జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని పూంచ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ ట్రక్కులపై ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయి. గడిచిన నెల రోజుల్లోనే పూంచ్ జిల్లాలో ఇది రెండో ఉగ్రదాడి ఘటన కావడం గమనార్హం.

Jammu Kashmir: పూంచ్‎లో ఉగ్రదాడి.. నేలకొరిగిన ముగ్గురు జవాన్లు
New Update

Jammu Kashmir: జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)లోని పూంచ్ లో తీవ్ర ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ ట్రక్కులపై ఉగ్రమూకలు దాడికి తెగబడ్డాయి. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. పూంచ్ జిల్లాలోని తనమంది ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ కాన్వాయ్‎పై టెర్రరిస్టులు దాడికి దిగడంతో భారీస్థాయిలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దాడి జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలు బయల్దేరాయి. గడిచిన నెల రోజుల్లోనే పూంచ్ జిల్లాలో ఇది రెండో ఉగ్రదాడి ఘటన కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: TS Police Jobs: కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయండి.. సీఎంను కలిసిన నల్గొండ ఎమ్మెల్యేలు

ఉగ్రవాదులు, భారత సైన్యం మధ్య భీకరంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు నేలకొరిగారు. మరో ముగ్గురు జవానులు తీవ్రంగా గాయపడ్డారని భారత సైన్యం ప్రకటించింది. గత నెలలో సైన్యం, ప్రత్యేక బలగాలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ప్రారంభించగా, రాజౌరీలోని కలకోట్‌లో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు మరణించారు.

ఇది కూడా చదవండి: Corona JN1 : దేశంలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలివే!

తాజాగా, ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం ఆధారంగా డీకేజీ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా గురువారం కాల్పుల ఘటన జరిగింది. రెండేళ్ల నుంచి జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల అలజడి పెరిగింది. ఈ వ్యవధిలోనే ఏకంగా 35 మంది జవాన్లు నేలకొరిగారని ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి.

#jammu-kashmir-news #terror-attacks #punch-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe