TS Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. ఈ సారి ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

పదవ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్‌ 2024 మార్చిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ పరీక్షలు కూడా మార్చిలోనే నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కరోనా తరువాత నుంచి పదవ తరగతి పేపర్లను 11 నుంచి 6 పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే.

New Update

2023లో నిర్వహించినట్లే వచ్చే ఏడాది కూడా ఆరు పేపర్లకే పదో తరగతి పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ ను అతి త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ ను ఆన్ లైన్‌ లో సమర్పించాల్సి ఉంటుంది.

Also read: త్రిపుర గవర్నర్‎గా నల్లు ఇంద్రసేనారెడ్డి..తెలంగాణ నేతకు కీలక పదవి…!!

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గుర్తింపు పొందిన స్కూల్స్‌ తమ వద్ద చదివే విద్యార్థుల డేటాను యూడైస్‌ ప్లస్‌ వెబ్‌ సైట్‌ లో ఈ నెల 28 లోపు అప్‌డేట్ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సూచించారు.

యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యూకేసన్‌ విద్యార్థుల డేటాను ప్రామాణికంగా తీసుకుంటారు. పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పూర్తి వివరాలను సేకరించి అన్ని వివరాలను ఉపాధ్యాయుల వద్ద ఉంచుకోవడమే కాకుండా ఆన్‌ లైన్‌ లో కూడా నింపాలని తెలిపారు.

Also read: యూనివర్సిటీ హాస్టల్‌ లో ఫుడ్‌ పాయిజినింగ్‌..300 మంది విద్యార్థినులకు అస్వస్థత!

Advertisment
తాజా కథనాలు