Tenth Exams: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు!

పదో తరగతి పరీక్షలు పది సార్లు పాస్‌ అయ్యాడు ఓ యువకుడు..ఆ యువకుని విజయాన్ని ఊరంతా వేడుకలా నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. మరి పది పరీక్షల మీద ఇన్ని సార్లు దండయాత్ర చేసిన ఆ యువకుని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

New Update
Tenth Exams: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు!

Tenth Exams: సాధారణంగా పరీక్షలు రాయడం వాటిలో పాసవ్వడం, తప్పడం అనేది సహజం. పరీక్షల్లో ఒకసారి తప్పితే..మరోసారి రాసి పాస్‌ అవుతారు..ఒకసారి కాకపోతే రెండు సార్లు అది కాకపోతే మూడు సార్లు..ఆ తరువాత రాసే వారు కూడా దాని మీద ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ విద్యార్థి మాత్రం ఏకంగా పదో తరగతి పరీక్షలు పదిసార్లు రాసి విజయం సాధించాడు. దీంతో ఆ గ్రామస్థులంతా అతడిని గ్రామం మొత్తం ఊరేగించి వేడుక నిర్వహించారు.

ఈ వేడుక కార్యక్రమం మహారాష్ట్రలోని బీడ్‌ గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన కృష్ణ నామ్‌ దేవ్‌ ముండే అనే యువకుడు 2018 సంవత్సరం నుంచి పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో అతను పది సార్లు పరీక్షలు రాశాడు. తాజాగా ఇప్పుడు పదో తరగతి పరీక్షలు పాస్‌ అయ్యాడు.

దీంతో గ్రామస్థులు అంతా అతడి విజయాన్ని ఓ వేడుకల నిర్వహించారు. ఊరంతా బ్యాండు మేళంతో ఊరేగిస్తూ...స్వీట్లు పంచిపెట్టారు.

Also read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 1202 ఖాళీలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు