Tenth Results: నేడు పదవతరగతి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు!

తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవ్వనున్నాయి. దీని గురించి పదవ తరగతి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. జూన్‌ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు పదవ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది.

NEET Results : నీట్‌ రీ ఎగ్జామ్ రిజల్ట్స్​ విడుదల​..!
New Update

Telangana: తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవ్వనున్నాయి. దీని గురించి పదవ తరగతి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. టెన్త్‌ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను ఈ వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చని అధికారులు తెలిపారు.

వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు పదవ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది. తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.టెన్త్ వార్షిక‌ ఫ‌లితాల్లో 91.31 ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. బాలిక‌లు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

గ‌తేడాది 89.60 శాతం ఉత్తీర్ణ‌త రాగా, ఈ సంవత్సరం 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Also read: ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన అద్వానీ!

#telangana #results #tenth #supply-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe