Tenth Results: నేడు పదవతరగతి సప్లిమెంటరీ ఫలితాలు! తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవ్వనున్నాయి. దీని గురించి పదవ తరగతి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు పదవ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది. By Bhavana 28 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవ్వనున్నాయి. దీని గురించి పదవ తరగతి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ వెబ్‌సైట్ bse.telangana.gov.in లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు పదవ తరగతి బోర్డు సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించింది. తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే.టెన్త్ వార్షిక ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత రాగా, ఈ సంవత్సరం 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. Also read: ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన అద్వానీ! #telangana #results #tenth #supply-results మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి