టెన్షన్ టెన్షన్..ప్రకాశం బ్యారేజ్‌కి పెరుగుతోన్న వరద! ఏపీలో భారీ వర్షాలు కురుస్తునన్నాయి. ఇటు విజయవాడలోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరానికి చుట్టు పక్కల ఉన్న నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోనూ భారీ వర్షం కారణంగా పలు రహదారులు ముంపునకు గురయ్యాయి. అలాగే కొండ చరియలు విరిగిపడ్డాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌కు కృష్ణానది వరద పోటు పెరుగుతోంది. By Vijaya Nimma 26 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి విజయవాడ భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది. కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న జనం భయంభయంగా గడుపుతున్నారు. రోడ్లపైనే భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పెరుగుతోంది. అంతేకాకుండా వాగులు పొంగి పొరలుతున్నాయి. మునేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణా నదికు భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో 70 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. 70 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నది తీర దిగువ ప్రాంతంలో నివసించే వారిని అప్రమత్తం చేసినట్టు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి