భారీ వర్షాలకు వరదలు వచ్చిన ప్రతిసారి ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలు కోతకు గురై నది కాలగర్భంలో ఊర్లు, పంట పొలాలు కలిసిపోతున్నాయని ప్రజలు బాధపడుతున్నారు. రైతుల కళ్ళముందే కనుమరుగవుతున్న వందల ఎకరాల పంట భూములను చూసి వారి ప్రాణం విలవిలాడుతున్నారు. అంతేకాకుండా ఈగోదావరి వరద కోతకు కోనసీమ కొబ్బరి చెట్లుకూడా గోదావరిలో వందలకొద్ది కలిసిపోతున్నాయి. వందల ఎకరాలకుపైగా కోతకు గురై గోదావరి కాలగర్భంలో కలిసిపోవటంతె.. పంట భూముల్లను నమ్ముకున్న కోన బిడ్డులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు.
గత ఏడాది అధిక సంఖ్యలో గోదావరి నది తీర ప్రాంతం కోతకు గురికాగా మళ్లీ వరదలు వస్తుండడంతో గోదావరి తీర ప్రాంత వాసులు భయాందోళన గురవుతున్నారు. ముఖ్యంగా ముమ్మిడివరం మండలంలో గురాజపులంక, లంకఆఫ్ ఠాణేలంక, ఠాణేలంక, గేదెల్లంక, కూనలంక, అన్నంపల్లి, చింతపల్లంక, సలాదివారిపాలెం, కమిని, కర్రివానిరేవు, ఐ. పోలవరం మండలంలో కేశనకుర్రు, పొగాకులంక, పల్లిగూడెం, కన్నపులంక, జాంభవానిపేట, మురమళ్ల, తిళ్ళకుప్ప,పశువుల్లంక, కొమరగిరి, ఎదుర్లంక, గుత్తెనదీవి, జి.మూలపొలం, గోగులంక, భైరవలంక. కాట్రేనికొన మండలంలో కాట్రేనికోన, పల్లంకుర్రు, నడవపల్లి, కుండలేశ్వరం, తాళ్లరేవు మండలంలో పొట్టిలంక, కొత్తలంక, అరటికాయలంక, పిల్లంక తదితర గ్రామాల్లో వరదలకు ఎఫెక్ట్ అవుతాన్నాయి.
అంతేకాకుండా సుమారు 25 గ్రామాల్లో 32 ప్రాంతాలలు వరద ముంపుకు గురి అవుతున్నాయి. ప్రభుత్వం గోదావరి ప్రవాహం వేగంగా మలుపు తిరిగే ప్రాంతం ఎదుర్లంక వద్ద గ్రోయిన్స్ నిర్మాణానికి 78 కోట్ల రూపాయలను మంజూరుచేయగా.. పనులు ప్రారంభించే సమయానికి వరదలు రావడంతో పనులకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తి అయితే ఎదుర్లంక ప్రాంతంలో నదీ కోతను కొంత వరకూ అరికట్టవచ్చని స్దానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పనులు పూర్తి కాకపోవడంతో వరదలు మొదలు కావడంతో లంక గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.