Vijayawada: విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. అంగన్వాడి నిరసన కార్యక్రమంలో పాల్గన్న సీఐటీయూ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు క్రాంతి కుమార్ అనే నాయకుడిపై దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. క్రాంతి కుమార్ పై బస్సులో పీక నొక్కుతూ కడుపులో పిడుగులు గుద్దిన వీడియో వెలుగులోకి వచ్చింది.
This browser does not support the video element.
సీఐ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. సీఐటీయూ నాయకుడిని ఒక బస్సులో నుంచి మరొక బస్సులోకి మార్చుతూ దాడి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై అంగన్వాడిలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో అరెస్టులు, ఉద్రిక్త పరిస్థితుల తరువాత మొదటిగా RTV తో మాట్లాడారు అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణీ. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించిన వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాలకు తరలించిన వాళ్లంతా తిరిగి విజయవాడకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న అంగన్వాడీలపై విచక్షణ రహితంగా పోలీసులు ప్రవర్తించారని ఆరోపించారు. మహిళలను తాకరానిచోట్ల తాకారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు తీసుకొచ్చి బెదిరింపులు దిగిన వెనక్కి తగ్గేది లేదని ఖరకండిగా చెప్పారు. ఏ విధంగా పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తారో మేము చూస్తామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: అంగన్వాడీ దీక్షా శిబిరం పై విరుచుకుపడ్డ పోలీసులు…దొరికిన వారిని దొరికినట్లు లాగిపడేశారు!