AP : కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీ అధికారుల తీరుపై దళితుల ఆందోళన..!

కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఆధికారుల వైఖరిని నిరసిస్తూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎటువంటి నోటీసులు జారీచేయకుండా కొబ్బరి చెట్లకు బహిరంగ వేలం వేయడంతో బాధితులు మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

New Update
AP : కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీ అధికారుల తీరుపై దళితుల ఆందోళన..!

Konaseema District : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. కోట గ్రామంలో పంచాయితీ కొబ్బరి చెట్ల బహిరంగ వేలం పాటలో ఉద్రిక్తత నెలకొంది. వేలం పాట కొనసాగుతుండగా పాట నిర్వహించే అధికారి ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుండగా మరో సామాజిక వర్గం పంచాయతీ అధికారులను నిలదీసి వాగ్వివాదానికి దిగింది. పంచాయతీ ఆధికారుల (Panchayat Officials) వైఖరిని నిరసిస్తూ ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసింది.

Also Read: రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారు.. టీడీపీ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్..!

వివరాల్లోకి వెళ్తే.. గత ముప్పై ఏళ్ళక్రితం ప్రభుత్వ అనుమతితో జెడ్ పి స్థలంలో కొబ్బరి మొక్కలు (Coconut Plants) నాటి సంరక్షించామని.. నేడు తాము ఫలసాయం పొందుతున్న తరుణంలో పంచాయతీ అధికారులు తమకు ఎటువంటి నోటీసులు జారీచేయకుండా కొబ్బరి చెట్లకు బహిరంగ వేలం వేస్తున్నారని పలువురు దళిత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఇలా చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మంత్రి సుభాష్ స్పందించి చెట్టు పట్టా పథకం కింద తాము పొందుతున్న కొబ్బరి చెట్లను తమకే ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు