Kadapa : కడపలో ఉద్రిక్తత.. అఖిల పక్ష నేతలు అరెస్ట్.!

కడపలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సీఎం పర్యటన అడ్డుకునేందుకు యత్నించిన అఖిల పక్ష నేతలు అరెస్ట్ అయ్యారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ, పారిశ్రామిక అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఆందోళన చేసిన వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

Kadapa : కడపలో ఉద్రిక్తత.. అఖిల పక్ష నేతలు అరెస్ట్.!
New Update

Kadapa : కడప(Kadapa) లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సీఎం పర్యటన అడ్డుకునేందుకు యత్నించిన అఖిల పక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ, పారిశ్రామిక అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులు, కడప సమగ్రభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వస్తున్న నేతలను ప్రెస్ క్లబ్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అఖిల పక్ష నేతలకు మద్య వాగ్వివాదం తోపాటు తోపులాజ జరగడంతో డీఎస్పీ రంగ ప్రవేశం చేశారు. ఆందోళన చేపట్టిన అఖిల పక్ష నేతలను అరెస్ట్ చేశారు.

Also read: వామ్మె.. బికినీలో దర్శనమిచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ జగతి.!

ఈ క్రమంలోనే సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సైతం పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కాలు కదిపితే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. సమ్మె చేస్తున్న అగన్వాడీ కార్యకర్తలను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో, పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కరం కోసం నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా మాకు లేదా అని నిలదీశారు. ప్రశ్నించిన వారిపై పోలీసులు అరెస్ట్ చేయడం తగదని సూచించారు. సీఎం జగన్ కు తమ గోడు విన్నవించుకునే అవకాశం కూడా లేదా? ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు.

Also read: జగన్‌కు పీకే ఝలక్‌.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!

కాగా, నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్(AP CM Jagan). సీఎం పర్యటన నేపథ్యంలో భారి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తుగా విద్యార్ధి, యువజన, కార్మిక, పలు పార్టీల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

#andhra-pradesh #kadapa #kadapa-steel-factory
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe